వరి పంటలు ఎండకుండా 16L కాలువ ద్వారా నెల్లుట్ల చౌట కుంటకు నీటి మల్లింపు..
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 13(ప్రజావాణి): జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం, నెల్లుట్ల గ్రామంలో వరి పంటలు ఎండిపోకుండా రైతులను ఆదుకునేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి చొరవతో కీలక చర్యలు చేపట్టారు.
గత కొన్ని రోజులుగా సాగునీటి కొరతతో వరి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో, రైతుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సూచనలతో వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ తన ఆధ్వర్యంలో 16L కాలువ ద్వారా గోదావరి జలాలను చౌట కుంటకు మళ్లించి కుంటను పూర్తిగా నింపారు..
దీంతో నెల్లుట్ల గ్రామంలోని వరి పంటకు సాగునీరు అందనుంది. రైతులకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి పంటలు కాపాడుకోవడానికి అవకాశం లభించిందని. రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి, సర్పంచ్ రామకృష్ణ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో..
పటేల్ గూడెం సర్పంచ్ పొన్నాల బుచ్చిరెడ్డి, నెల్లుట్ల ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు మెంబర్లు బొజ్జం సునీత ప్రభాకర్, తాండ్ర భరత్ , గోతుకుల రవి, నాయకులు చిట్ల తిరుమల రెడ్డి, పెంతల సోమయ్య , బోయిని వెంకటేష్, ఎడ్ల నగేష్, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, గ్రామస్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

