📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు

అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు

📰 Generate e-Paper Clip

*అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు*!
*ఎర్రజెండా సాక్షిగా ఘన నివాళులు*

*మన ప్రజావాణి*
మందమర్రి

అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మందమర్రి పట్టణంలోని స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా *సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గారాజ్ మాట్లాడుతూ కామ్రేడ్ గుండా మల్లేష్ తన జీవితాన్ని పేదలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అంకితం చేసిన గొప్ప ప్రజా నాయకుడని కొనియాడారు. ఎర్రజెండా ఆశయాల కోసం, శ్రమజీవుల విముక్తి కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం, పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాడటమే కామ్రేడ్ గుండా మల్లేష్‌కు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. నేటి సమాజంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, కార్మికుల సమస్యలు, పేదల కష్టాలపై వామపక్ష శక్తులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఆర్ వెంకన్న AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఆంటోనీ దినేష్ MD రసూల్ జక్కన బోయిన సమేందర్ హమాలి సంఘం నాయకులు. D. సంపత్ సాగే పోశం పూరెల్ల శ్రీనివాస్ ఆవుల కుమార్ పూరెల్ల మహేష్ దామరకుంట రాజేష్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.