📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదండేపల్లి మండల ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శిగా కొల్లూరి సతీష్

దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శిగా కొల్లూరి సతీష్

📰 Generate e-Paper Clip

దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శిగా కొల్లూరి సతీష్
ప్రజావాణి రిపోర్టర్‌కు కీలక బాధ్యతలు
దండేపల్లి, అక్టోబర్ 13 (ప్రజావాణి):
దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీలో సంయుక్త కార్యదర్శిగా ప్రజావాణి రిపోర్టర్ కొల్లూరి సతీష్ నియమితులయ్యారు. మండల ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నికల్లో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కొల్లూరి సతీష్‌కు అభినందనలు తెలిపారు. పాత్రికేయ రంగంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, ప్రజలకు మరియు అధికార యంత్రాంగానికి మధ్య వారధిగా నిలిచి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
సంయుక్త కార్యదర్శిగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు కొల్లూరి సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. పాత్రికేయుల ఐక్యతకు, హక్కుల పరిరక్షణకు, ప్రజా సమస్యలపై నిరంతరం వార్తలు అందించడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.