📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్దేవరయాంజాల్‌లో దుర్గామాతలకు ప్రత్యేక పూజలు

దేవరయాంజాల్‌లో దుర్గామాతలకు ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

దేవరయాంజాల్‌లో దుర్గామాతలకు ప్రత్యేక పూజలు

మూడు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు.. ఆకట్టుకున్న భరతనాట్యం ప్రదర్శన

శామీర్‌పేట: శామీర్‌పేట డివిజన్ పరిధిలోని దేవరయాంజాల్ గ్రామంలో మూడు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ, జై భవాని ఉత్సవ కమిటీ, శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయ కళారూపాల ప్రదర్శనతో ఉత్సవాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమాల్లో జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోల్డ్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పచ్చిమాడ్ల నర్సింగ్ రావు గౌడ్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు పట్నం నర్సింహా రెడ్డి, రామాలయం మాజీ ధర్మకర్త పట్నం నర్సింహారెడ్డి, మాజీ వార్డు సభ్యుడు జూపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

అలాగే మూడు ఉత్సవ కమిటీలకు చెందిన సభ్యులు ఎల్లెంకి రఘువీర్ గౌడ్, చింతల శ్రీనికేతన్ రెడ్డి, రంగప్పగారి నాగరాజు గౌడ్, పొట్టోల్ల ఆనంద్, నేమూరి రామచందర్ గౌడ్, నక్క మురళి గౌడ్, కైరంకొండ మధుసూదన్ రావు, బిన్నీ శ్రీనివాస్ గౌడ్, పిన్నింటి సుధాకర్ రెడ్డి, కట్ట అనంతరెడ్డి, మిర్యాలకర్ హుసేన్, మేకల గణేష్, పట్నం రాంరెడ్డి, రంగప్పగారి మల్లికార్జున్ గౌడ్, కౌడే శ్రీనివాస్, పొట్లచెరువు వినయ్ కుమార్, కౌడే మహేష్, బుర్ర సాయికిరణ్ గౌడ్, కట్ట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల్లో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.