📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబోయకొండలో పార్వతీదేవి అలంకారంలో గంగమ్మ దర్శనం

బోయకొండలో పార్వతీదేవి అలంకారంలో గంగమ్మ దర్శనం

📰 Generate e-Paper Clip

బోయకొండలో పార్వతీదేవి అలంకారంలో గంగమ్మ దర్శనం

మన ప్రజావాణి
చౌడేపల్లి, అక్టోబరు 13:

అన్నమయ్య జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు అమ్మవారు శ్రీ పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఉభయదారుల సహకారంతో ఆలయంలో గణపతి హోమం, చండీ హోమం తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరడిగుంటకు చెందిన కె.వి. వీరభద్రప్ప కుమారుడు కె.వి. రెడ్డెప్ప (సాయి భవానీ క్యాటరింగ్), పుంగనూరుకు చెందిన ఎన్. రామిరెడ్డి కుటుంబ సభ్యులు, బెంగళూరుకు చెందిన సాగిరాజు బాలవాణి, సాగిరాజు శ్రీహరిరాజు, లావణ్య, కె. దిలీప్ కుమార్, సవిత, విజయకృష్ణ, కొండూరుకు చెందిన విద్యావతి, రామ్ మోహన్ రెడ్డి, ఉషారాణి, కృష్ణారెడ్డి ఉభయదారులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి జె. ఏకాంబరం, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉభయదారులకు తీర్థప్రసాదాలు అందజేసి, అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.