బోయకొండలో పార్వతీదేవి అలంకారంలో గంగమ్మ దర్శనం
బోయకొండలో పార్వతీదేవి అలంకారంలో గంగమ్మ దర్శనం మన ప్రజావాణి చౌడేపల్లి, అక్టోబరు 13: అన్నమయ్య జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు అమ్మవారు శ్రీ పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉభయదారుల సహకారంతో ఆలయంలో గణపతి హోమం, చండీ హోమం తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరడిగుంటకు చెందిన కె.వి. వీరభద్రప్ప...