📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశ్రీరాంపూర్‌ హరిహర వైన్స్‌ నుంచి వేలాల బెల్ట్‌ షాపులకు ఆటోల ద్వారా మద్యం సరఫరా

శ్రీరాంపూర్‌ హరిహర వైన్స్‌ నుంచి వేలాల బెల్ట్‌ షాపులకు ఆటోల ద్వారా మద్యం సరఫరా

📰 Generate e-Paper Clip

*శ్రీరాంపూర్‌ హరిహర వైన్స్‌ నుంచి వేలాల బెల్ట్‌ షాపులకు ఆటోల ద్వారా మద్యం సరఫరా?*

శ్రీరాంపూర్ హరిహర వైన్స్‌ నుంచి వేలాలకు ఆటోల ద్వారా తరలిస్తున మద్యం పై ఎక్సైజ్‌ అధికారులు విచారణ చేపట్టాలని స్థానికు డిమాండ్‌

ప్రజావాణి , జైపూర్‌,అక్టోబర్‌ 12

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోనీ 20 గ్రామాలకు శ్రీరాంపూర్‌ పట్టణంలోని హరిహర వైన్స్‌ నుంచి మండలంలోని అన్ని గ్రామాలకు మరియు గ్రామంలోని బెల్ట్‌ షాపులకు మద్యం అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మద్యం పెట్టెలతో వాహనంలో తరలిస్తున్న దృశ్యాలు అనుమానాలకు తావిస్తున్నాయి.
బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా వెనుక అసలు కథేమిటి?
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా జరుగుతోందా? TS 01UA 5434 ఆటో ద్వారా తరలిస్తున్న మద్యం ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మద్యం తరలింపు వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.