📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఎన్‌సీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయుల సన్మాన వేడుక ....ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మేయర్ జక్క...

ఎన్‌సీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయుల సన్మాన వేడుక ….ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, అబ్బావతిని నరసింహ

📰 Generate e-Paper Clip

 

నారపల్లి, అక్టోబర్ 12 (ప్రజావాణి):నారపల్లి–చౌదరిగూడ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం (ఎన్‌సీటీఏ–పోచారం మున్సిపాలిటీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సన్మాన వేడుక ఆదివారం నారపల్లిలోని ట్రినిటీ ఎలైట్ బాంక్వెట్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శకులని, భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

ఎన్‌సీటీఏ అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కోశాధికారి తొంట కృష్ణ స్వాగతం పలికారు. సలహాదారు అబ్బపతిని నరసింహ, సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు తొంట సత్యనారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్, నరేందర్, నరేంద్ర, షబానా సుల్తానా, రవీందర్, రమేష్, రమ, మౌనిక, జానయ్య, పరుశురాంలను వారి విశిష్ట సేవలకు గుర్తింపుగా మెమెంటోలు, శాలువాలు, ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు.

సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్. కిరణ్ కుమార్ కార్యక్రమాన్ని నిర్వహించగా, సంయుక్త కార్యదర్శి డి. రవి వందన సమర్పణ చేశారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నారపల్లి, చౌదరిగూడ, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఉపాధ్యాయులు శ్రవణ్, వెంకటేశ్వర్లు, వెంకన్న, సత్యం, యాదగిరి, రజిత, కృష్ణవేణి, మమత, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.