ఎన్‌సీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయుల సన్మాన వేడుక ….ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, అబ్బావతిని నరసింహ

  నారపల్లి, అక్టోబర్ 12 (ప్రజావాణి):నారపల్లి–చౌదరిగూడ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం (ఎన్‌సీటీఏ–పోచారం మున్సిపాలిటీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సన్మాన వేడుక ఆదివారం నారపల్లిలోని ట్రినిటీ ఎలైట్ బాంక్వెట్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శకులని, భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న...