📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాల కూల్చివేత

జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాల కూల్చివేత

📰 Generate e-Paper Clip

జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాల కూల్చివేత

జవహర్‌నగర్, అక్టోబర్ 12 (ప్రజావాణి ప్రతినిధి):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాప్రా మండల పరిధిలోని జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు సోమవారం గిర్దావర్ సత్యనారాయణ సమక్షంలో రెవెన్యూ సిబ్బంది జేసీబీల సహాయంతో పలు అక్రమ కట్టడాలను కూల్చివేశారు.

జవహర్‌నగర్‌లోని సంతోష్‌నగర్, చెన్నాపూర్, రాజీవ్ గాంధీనగర్, కేసీఆర్‌నగర్ ప్రాంతాల్లో ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం అందడంతో అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ఆక్రమణలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.