రేపు ధర్మాపురంలో బహుజన బతుకమ్మ కార్యక్రమం –
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామంలో రేపు (అక్టోబర్ 13, 2026) బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్పంచ్ దౌపాటి అశ్విని రవి, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పులిగిల్ల యాకయ్య లు సోమవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు.
“గ్రామీణ ఉపాధి, స్వయం సమృద్ధి – జెన్ జీ ఆకాంక్షల నెత్తిపడుతూ.. బహుజన బతుకమ్మను ఊరువాడలను ఏకం చేస్తూ జరుపుకుందాం” అనే నినాదంతో అక్టోబర్ 8 నుండి 18 వరకు ఊరూరా వాడవాడలా ఉద్యమంగా బహుజన బతుకమ్మను జరుపుకుంటున్నామని తెలిపారు.
అక్టోబర్ 4న బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్ లో బహుజన బతుకమ్మ పాట ఆవిష్కరణ జరిగిందని, అందులో భాగంగా అక్టోబర్ 13న (రేపు) ధర్మాపురం, దేవరుప్పుల మండలం, జనగామ జిల్లాలో బహుజన బతుకమ్మ వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు.
బహుజన బతుకమ్మ ఉత్సవమే కాదు – ఉద్యమమంటూ చాటుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

