కల్లేపల్లిలో ఘనంగా దుర్గామాత ఉత్సవాలు ప్రారంభం
25వ ఏడాదిలోకి అడుగుపెట్టిన స్నేహ యూత్ ఉత్సవాలు
బెజ్జంకి, అక్టోబర్ 12 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలో స్నేహ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాలు 25వ సంవత్సరం సందర్భంగా ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు, కలశ స్థాపన నిర్వహించారు.స్నేహ యూత్ సభ్యులు ఎరుపు వస్త్రధారణలో అమ్మవారికి ప్రత్యేక హారతులు ఇచ్చి మొక్కులుచెల్లించుకున్నారు
గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా దుర్గామాత ఉత్సవాలను నిర్వహిస్తున్న స్నేహ యూత్ సభ్యులను గ్రామ పెద్దలు, భక్తులు అభినందించారు. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ కుంకుమ పూజలు,లలితా సహస్రనామ పారాయణంతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు.దసరా పండుగ రోజున సద్దుల బతుకమ్మ వేడుకలతో పాటు దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుపుతూ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్‌కే ఫౌండేషన్ చైర్మన్ బుర్ర సంజయ్ గౌడ్,గ్రామ సర్పంచ్ బిగుల్లా మోహన్, ఉపసర్పంచ్ వినీత్ గౌడ్, స్నేహ యూత్ గౌరవ అధ్యక్షుడు వడ్లకొండ సంపత్,యూత్ సభ్యులు, గ్రామస్తులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

