రోడ్డు పూర్తికాకుండానే బిల్లు కాజేత..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 12
జుక్కల్ మండల కేంద్రంలోని ఈజీఎస్ పథకంలో బా నది మట్టి రోడ్డు రైతులకు చేళ్లకు వెళ్లడానికి సుమారుగా రూ… ఏడు లక్షల అంచనా వ్యయంతో 2023 సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోడ్డు మార్గంలో రోడ్డు వేశారని గ్రామస్తులు తెలిపారు.. రోడ్డు పనులు ప్రారంభించి సగం వరకే పరిమితం చేశారని, పనులు పూర్తి కాకుండానే పూర్తి బిల్లు కాజేశారు.. ఈనెల 28న గ్రామ పంచాయతీల అభివృద్ధిపై చర్చ అంటున్న అధికారులకు, గ్రామీణ చెందిన యువకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.. ఉపాధి హామీ ద్వారా రోడ్డు వేయకుండా వేసినట్టు చూపుతూ రూ…7,83,820 ఖర్చు చేసినట్లు తెలిపారు.. మరి దీనికి గ్రామపంచాయతీ రోడ్డు తీర్మానం చేశారా? పంచాయతీలో తీర్మానం చేశారా? ఫార్మేషన్ రోడ్డు అంచన వేయం కాఫీ ఉందా? ఫార్మేషన్ రోడ్డు కాదా….. మరి ఇట్టి పా నదికి మండల సర్వేయర్ రిపోర్టు నక్ష ప్రకారంగా రోడ్డు మ్యాపింగ్ వేశారా? అని ప్రశ్నించారు… ఇప్పటికైనా అధికారులు సమగ్ర విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని యువకులు కోరుతున్నారు…

