📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకుప్పానగర్‌లో ఆధ్యాత్మిక వైభవం

కుప్పానగర్‌లో ఆధ్యాత్మిక వైభవం

📰 Generate e-Paper Clip

కుప్పానగర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. తొలి రోజే బాలా త్రిపురసుందరి దేవి దివ్య అలంకరణతో భక్తులకు కనువిందు!

శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం.. అమ్మవారి దర్శనంతో పులకించిన భక్తజనం

ఝరాసంగం, అక్టోబర్ 12 (ప్రజావాణి):

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో బాలా త్రిపురసుందరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి పారవశ్యాన్ని నింపుతున్నాయి. ఉత్సవాల తొలిరోజు అమ్మవారి దివ్య అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి దర్శనంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిశక్తి స్వరూపిణి అయిన బాలా త్రిపురసుందరి దేవి కరుణాకటాక్షాలు తమపై ఉండాలని, గ్రామ ప్రజలందరికీ సుఖశాంతులు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.

భక్తి, శక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే శరన్నవరాత్రి ఉత్సవాలు కుప్పానగర్‌లో భక్తులలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అమ్మవారి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తూ ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.