కుప్పానగర్‌లో ఆధ్యాత్మిక వైభవం
కుప్పానగర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. తొలి రోజే బాలా త్రిపురసుందరి దేవి దివ్య అలంకరణతో భక్తులకు కనువిందు! శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం.. అమ్మవారి దర్శనంతో పులకించిన భక్తజనం ఝరాసంగం, అక్టోబర్ 12 (ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో బాలా త్రిపురసుందరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి పారవశ్యాన్ని నింపుతున్నాయి. ఉత్సవాల తొలిరోజు అమ్మవారి దివ్య అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి దర్శనంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు...