📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి

📰 Generate e-Paper Clip

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రా

జీనామా చేయాలి: ఏఐడీఎస్ఓ డిమాండ్

అనంతపురం అక్టోబర్ 11 ప్రజావాణి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి అని నిన్నటి రోజున జరిగిన నిరసనలలో నిరసనకారులను చేసిన అరెస్టులను ఖండిస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO) సెంట్రల్ కౌన్సిల్ పిలుపు మేరకు అనంతపురంలో దేశావ్యాప్త నిరసన దినాన్ని పాటించడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా హాజరైన AIDSO రాష్ట్ర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ… చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ని తొలగించాలని, SIR ను రద్దు చేయాలని నిన్నటి రోజున ఢిల్లి, అస్సాం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉద్యమస్తున్న వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమకారులను శాంతియుత నిరసనలు చేయకుండా అరెస్టులు చేయడం, రైళ్లను, ఇంటర్నెట్ ని బంద్ చేయడం, ఎక్కడివారిని అక్కడ బంధించడం అనేది పూర్తిగా అప్రజాస్వామ్యక చర్య, నిరంకుశ ఫాసిస్టు చర్య అని విమర్శించారు. SIR ను అమలు చేసి 13కోట్ల మంది దేశ పౌరులను ఓటర్ల జాబితా నుండి తొలగించే అధికారం చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు లేదు. కేంద్ర ప్రభుత్వనికి బినామీగా పనిచేస్తూ పౌర చట్టాలకు విరుద్ధంగా వ్యవహారించిన జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పిలవబడే దేశ రాజధానిలో 24 గంటలకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, 57 మెట్రో ట్రైన్ లను, ఢిల్లీకు వివిధ రాష్ట్రల నుండి వస్తున్న రైళ్లను అడ్డుకోవడం, 35వేలమంది పోలీస్, మీలటరీ బలగాలను ఉపయోగించి నిరసనలను అడ్డుకోవడం, సివిల్ డ్రస్ లలో పోలీసుల ముందే నిరసిస్తున్న వారిని మతోన్మాద గుండాలు కొడుతున్న పట్టింపు లేకుండా ఉండడం ఫాసిజమే అవుతుంది.
న్యాయం ముందు అన్యాయం ఓడిపోక తప్పదు. శాంతి భద్రతలు ఉల్లంగించే విధంగా, ప్రజల నిరసన హక్కులను నిరుగార్చే విధంగా
పోలుసులు విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు, నిరసన కారులను అరెస్టు చేయడాన్ని AIDSO తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన AIDSO జిల్లా నాయకులు సురేష్ గారు మాట్లాడుతూ అప్రజాస్వామికంగా SIR (ఓటర్ల జాబితా సవరణ) ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఉద్యమిస్తున్న విద్యార్థులు యువకులు, మహిళలు, విద్యార్ధి సంఘాల నాయకులను అప్రజాస్వామికంగా చేసిన అరెస్టులను అణిచివేతలను దేశ నలుమూలల నుండి ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. SIR ను రద్దు చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పటితో ఆగదని SIR ప్రతిని పూర్తిగా రద్దు చేసేంతవరకు కొనసాగుతుందని దేశవ్యాప్తంగా ప్రజాతంత్ర ప్రతిఘట ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కార్యక్రమంలో AIDSO రాష్ట్ర అధ్యక్షులు వి హరీష్ కుమార్ రెడ్డి, నాయకులు చరణ్ తేజ్, చంద్రిమ, కార్తీక్, రుద్రేష్, నాని మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.