📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీసీలకు కుల గణన రాజ్యాంగబద్ధ హక్కు కల్పించాలి - రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు

బీసీలకు కుల గణన రాజ్యాంగబద్ధ హక్కు కల్పించాలి – రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు

📰 Generate e-Paper Clip

బీసీలకు కుల గణన రాజ్యాంగబద్ధ హక్కు కల్పించాలి – రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 11(ప్రజావాణి): జిల్లా కేంద్రంలోని కెమిస్ట్ భవన్‌లో ఆదివారం బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం జిల్లా సమావేశం ఘనంగా జరిగింది.
ఈ సమావేశానికి అడ్వకేట్ గడ్డం అనిల్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు టి. చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ పాల్గొని మాట్లాడుతూ బీసీలకు కుల గణన రాజ్యాంగబద్ధ హక్కుగా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలు జనాభాలో మెజారిటీగా ఉన్నా ఏ విధమైన లాభం, ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ఓట్లతో అగ్రకులాల వారు గెలిచి అధికారంలోకి వస్తున్నారని, బీసీలను అలాగే అణగదొక్కాలని ప్లాన్ వేస్తున్నారని అన్నారు.
బీసీలలో చాలా కులాలు ఉన్నా మనమందరం బీసీలుగా ఒకటి కావాలని, ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలకు ఏ లాభం చేయలేదని, మన ఓట్లు మనం కలిసి ఉండి మన వాళ్లను నిలబెట్టి గెలిపించుకుంటేనే లాభం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యలో కూడా మన పిల్లలు వెనుకబడి ఉన్నారని, అందుకే అందరం ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో బీసీల సర్వే చేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేయడం చాలా మంచిదని, ఇందులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
బ్లూ ప్రింట్ ఇండియా అధ్యక్షులు పి. ప్రసాద్ గౌడ్, పాలకురి అశోక్ గౌడ్, జమాల్ షరీఫ్ అడ్వకేట్ & ప్రెసిడెంట్ ముస్లిం డెవలప్మెంట్ కమిటీ జనగామ జిల్లా మాట్లాడుతూ.. బీసీలు, మైనారిటీలు కలిసి ఉంటే వారి ఓట్లు చాలా ఉన్నా వారికి ఎలాంటి లాభం జరగడం లేదని, మనమందరం కలిసి పని చేయాలని, మన కమ్యూనిటీలో అవగాహన తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఆర్టిఏ మెంబెర్ చిలువేరు అభి గౌడ్, రంగు రాజశేఖర్, సాదిక్ అలీ అడ్వకేట్, ఆకుల శ్రీకాంత్, ప్రభాకర్, కంకరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.