*విజయదశమి జాతీయ పురస్కారం అందుకున్న దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ – చిలిపిచెడ్ మండలానికి గర్వకారణం*
హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ఘన సత్కారం – ఉపాధ్యాయ, సాహితీ సేవకు గుర్తింపు
చిలిపిచెడ్, అక్టోబర్ 11 (మన ప్రజావాణి న్యూస్, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి)
చిలిపిచెడ్ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, నవ భారతి పాఠశాల వ్యవస్థాపకులు, మిత్ర రత్నావళి, సాహిత్య రత్న, కాళోజి తెలుగు భాషా వైభవ జాతీయ పురస్కార గ్రహీత దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ మరో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో శ్రీ గౌతమేశ్వర సాహితీ గౌతమి కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ, సాహితీ సేవా రంగాలకు ఆయన చేస్తున్న విశిష్ట కృషికి గాను శాలువా కప్పి, స్వర్ణ కంకణంతో సత్కరించి విజయదశమి జాతీయ పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమేశ్వర కళా సేవా సంస్థ వ్యవస్థాపకులు దూడపాటి శ్రీధర్, ప్రముఖ కవులు తూము నర్సయ్య, దేవీప్రియ, వరలక్ష్మీ, వేణుగోపాలరావు తదితరులు పాల్గొని శ్రీకాంత్ గౌడ్ ను అభినందించారు.
జాతీయ స్థాయిలో పురస్కారం రావడం పట్ల జగ్గంపేట గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

