*ఆరుట్లలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు*
*బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ మానిపాటి శోభా*
, *ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, పాలకమండలి సభ్యులు*
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అక్టోబర్ 11 (ప్రజావాణి): ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా శనివారం రాత్రి ఆరుట్ల గ్రామంలో బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు పాల్గొని బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామంలోని బొడ్రాయి వద్ద, మేజర్ పద్మపాణి ఆచార్య యూత్ అసోసియేషన్ వద్ద, విశ్వకర్మ సంఘం వద్ద, కురుమ సంఘం వద్ద, వేణుగోపాలస్వామి భజన మండలి మంటపం వద్ద, శ్రీ చైతన్య యూత్ వద్ద, మణికంఠ యూత్ వద్ద, బ్యాంక్ కాలనీ సమీపంలో, సుందరయ్యనగర్ కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను ఏర్పాటు చేశారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆటపాటలతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్, వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్, ప్రజాగళం దామర భూపాల్, మాజీ ఉపసర్పంచ్ పాండాల జంగయ్యగౌడ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మంద మాధవి, మాడుగుల బాలమనికృష్ణగౌడ్, మొర్రి పద్మ ఐలయ్య, లాలగారి మణెమ్మ, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు మార బౌరమ్మతో పాటు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.

