గుర్తుతెలియని వ్యక్తి చైన్ స్నాకింగ్
ప్రజావాణి దినపత్రిక మార్కాపురం జిల్లా బ్యూరో అక్టోబర్ 10
పామూరు పోలీస్ (మార్కాపురం జిల్లా)
ఫిర్యాది :- సామాను గుర్రం నాగమ్మ w/o నాగయ్య, వయస్సు 70 సం|| రాలు, కులం కమ్మ, శ్రీనివాస నగర్ 1 మొదటి లైన్ పామవరు గ్రామం మరియు మండలం.
ముద్దాయి వివరాలు : కోనేటి విష్ణు s/o రవి, వయస్సు 22 సం|| రాలు, కులం ఎరుకల, విరాట్ నగర్ కాలనీ పామూరు గ్రామం మరియు మండలం.
కేసు వివరములు :- నిన్న అనగా తేది 09.10.2026న సాయంత్రం సుమారు 4:00 గంటల సమయంలో ముద్దాయి, ఫిర్యాది ఇంటి దగ్గరికి వెళ్ళి, తాను మరియు ఇంకొక వ్యక్తి ఇద్దరు అదే వీధి లో బిల్డింగ్ పని చేస్తున్నట్లు, ముద్దాయికి మంచి నీళ్ళు దప్పికి అయి, నీళ్ళు త్రాగడానికి అని ఫిర్యాది ఇంటి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుగగా, ఆమె మంచినీళ్లు ఇచ్చిన తర్వాత త్రాగి ముద్దాయి తన దగ్గర ఉన్న ఖాళీ బాటిల్ లో నీళ్ళు పొయ్యమని అడుగగా, ఫిర్యాది బాటిల్ లో నీళ్లు పోసే క్రమంలో ముద్దాయి, ఫిర్యాది మెడలో ఉన్న సుమారు 21 గ్రాము బరువు కలిగిన బంగారు ఛైను ను లాక్కొని వెళ్ళగా, ఫిర్యాది ఇచ్చిన రిపోర్ట్ మేరకు పామూరు పోలీస్ స్టేషన్ లో Cr. No. 92/2026 u/s. 304 (2) BNS కేసు గా నమోదు చేసి, పామూరు CI గారి ఆద్వర్యం లో SI గారు తన సిబ్బంది సహాయంతో ఈ రోజు అనగా తేది 10.10.2026 న మద్యాహ్నం 13:30 గంటలకు పామూరు నుండి కందుకూరు వెళ్ళు రోడ్డు జంక్షన్ దగ్గర అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి సుమారు 21 గ్రాముల బరువు కలిగిన బంగారు చైన్ ను స్వాదిన పరుచుకొని, ముద్దాయిని కనిగిరి కోర్టు లో హాజరు పరచమైనది.

