📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనెహ్రూ గంజ్‌లో ప్లాస్టిక్‌ కవర్లపై దాడులు – రూ.5,000 జరిమానా

నెహ్రూ గంజ్‌లో ప్లాస్టిక్‌ కవర్లపై దాడులు – రూ.5,000 జరిమానా

📰 Generate e-Paper Clip

నెహ్రూ గంజ్‌లో ప్లాస్టిక్‌ కవర్లపై దాడులు – రూ.5,000 జరిమానా

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నెహ్రూ గంజ్‌లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలపై అధికారులు దాడులు నిర్వహించి, సుమారు 5 కిలోల ప్లాస్టిక్‌ కవర్లను స్వాధీనం చేసుకుని, రూ.5,000 జరిమానా విధించారు. రిలయన్స్‌ దుకాణం ఎదుట నిర్మాణ సామగ్రిని నిల్వ ఉంచినందుకు సంబంధిత యాజమాన్యానికి రూ.2,000 జరిమానా విధించారు. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించరాదని, దుకాణాల ఎదుట నిర్మాణ సామగ్రిని ఉంచి ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించరాదని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ, పట్టణ పరిశుభ్రత కోసం ప్రజలు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండి, ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా గుడ్డ సంచులను వినియోగించాలని మున్సిపల్‌ అధికారులు పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన నల్గొండ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్‌ జి. శ్రీనివాస్‌, వార్డు అధికారులు, పారిశుధ్య కార్మికులు, శానిటేషన్‌ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.