📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadప్రజా సమస్యలపై పోరాటమే ఊపిరిగా రైతుల సంక్షేమానికి బిజెపి సైకిల్ బాట.

ప్రజా సమస్యలపై పోరాటమే ఊపిరిగా రైతుల సంక్షేమానికి బిజెపి సైకిల్ బాట.

📰 Generate e-Paper Clip

ప్రజా సమస్యలపై పోరాటమే ఊపిరిగా రైతుల సంక్షేమానికి బిజెపి సైకిల్ బాట.

380 కిలోమీటర్ల యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన పోతంగల్ నేతలు.

తిరిగొచ్చిన కిసాన్ మోర్చా నాయకులకు పోతంగల్‌లో నీరాజనాలు.

నూతన ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం.

కోటగిరి/ప్రజావాణి:-అటు ప్రజల అభ్యున్నతి ఇటు రైతన్న సంక్షేమమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి.ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప అభియాన్ నేడు గ్రామగ్రామానా స్ఫూర్తి రగిలిస్తోంది.ఇందులో భాగంగా ఇందూరు జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి నేతృత్వంలో బోధన్ నుంచి జగిత్యాల వరకు చేపట్టిన 380 కిలోమీటర్ల సుదీర్ఘ సైకిల్ యాత్ర విజయవంతంగా ముగిసింది.ఈ మహత్తర యాత్రలో పోతంగల్ మండల ప్రాంతం నుంచి ఈ యాత్రలో దిగ్విజయంగా పాల్గొని యాత్ర ను పూర్తి చేసుకొని వచ్చిన మండల కిసాన్ మోర్చా అధ్య క్షులు ఓమన్నా పటేల్,లక్ష్మణ్ పటేల్‌లకు స్థానిక నాయకు లు,కార్యకర్తలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. రైతన్నల హక్కుల సాధన కోసం వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కి తమ కష్టాన్ని నమ్ముకున్న నాయకులను పూలమాల లు,శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి న ప్రకాష్ పటేల్‌ను స్థానిక నాయకులు,కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రకాష్ పటేల్ నాయకత్వంలో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరా టం చేయాలని ఆయన మరిన్ని శిఖరాలను చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.రైతాంగ శ్రేయస్సు కోసం కిసాన్ మోర్చా నేత లు చూపిన చొరవ చేసిన కృషి మాటలకు అతీతమని ప్రతి ఒక్కరికీ ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఇదే ఉత్సాహంతో మండలంలోని బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, మహిళలు,యువత సంక్షేమం కోసం మన మంతా కలిసి కట్టుగా శ్రమించాలనీ అన్నారు.ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తూ పార్టీ బీజేపీని బలోపేతాని కి నిరంతరం కృషి చేయాలనీ అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మైనా ర్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నయీముద్దీన్,మండల ప్రధా న కార్యదర్శులు మేదరి శంకర్,బోయి విజయ్,సీనియర్ నాయకులు పబ్బ శేఖర్,కిరణ్ సెట్,వెంకా గౌడ్,బూత్ అధ్యక్షుడు వినోద్,కార్యకర్తలు శంకర్,శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.