వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
* కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి అజయ్ కుమార్
* కల్చరల్ ఆర్గనైజర్ ఎన్. రమాదేవి
* అధ్యాపకులు కోమల రచన తిరుపతిసదయ్య
జమ్మికుంట అక్టోబర్ 9 (ప్రజావాణి)
సింగపురంలోని వి.ఎస్.ఆర్. డిగ్రీ కళాశాలలో ఈరోజు బతుకమ్మ పండుగను ఘనంగానిర్వహించారుతెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థినులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారుఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం పూల సౌరభంతో పండుగ వాతావరణంతో కళకళలాడింది.
విద్యార్థులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించి పండుగ విశిష్టతను చాటిచెప్పారుఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి అజయ్ కుమార్, కల్చరల్ ఆర్గనైజర్ ఎన్. రమాదేవి, అధ్యాపకులు కోమల రచన, తిరుపతిసదయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు.

