రిషి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
ముఖ్య అతిథిగా హాజరైన
ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసచారి
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం అక్టోబర్ 09
అడవిదేవులపల్లి
మండల కేంద్రం లో
స్థానిక రిషి కాన్సెప్ట్ స్కూల్లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసచారి మాట్లాడుతూ… నేటి తరం విద్యార్థులకు మన పండుగలు, సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకే పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలను ముందస్తుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటి వేడుకల ద్వారా పిల్లల్లో మన సాంప్రదాయాల పట్ల అవగాహన మరియు గౌరవం పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో పాఠశాల ప్రాంగణంలో కోలాహలం సృష్టించారు. పిల్లల విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శంకర్, నాగ సైదులు, వెంకన్న, రాజేశ్వరి, అన్వర్, వీణ, అనిల్ తదితరులతో పాటు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు.