📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమిర్చి బజ్జీలు వేసిన ప్రభుత్వ విప్

మిర్చి బజ్జీలు వేసిన ప్రభుత్వ విప్

📰 Generate e-Paper Clip

*మిర్చి బజ్జీలు వేసిన ప్రభుత్వ విప్…*

*ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09*

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ సమీపం లో బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసి తులైన లప్ప నాయక్ తండా వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్య క్రమానికి శుక్రవారం రోజు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఆయిలయ్య మార్గ మధ్యలో ఓ చిన్న హోటల్ వద్ద ఆగారు. అక్కడ హోటల్ నిర్వా హకులను , స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారితో కొద్దిసేపు ముచ్చ టించారు. ఈ సందర్భంగా హోటల్‌లో ప్రభుత్వ విప్ స్వయంగా మిర్చి బజ్జీలు వేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచారు. ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్య కలిసిమెలిసి ఉంటూ , సామాన్యులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆయన తీరు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.
పదవిలో ఉన్నా సా మాన్యుడిలా ప్రజలతో మమేకమవుతూ..ఆప్యా యతను పంచుతూ ముందుకు సాగిన బీర్ల ఐలయ్య సరళమైన వ్యవహారశైలి అక్కడి వారిలో ఆనందాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.