📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా ఇన్చార్జిగా నీలం భాస్కర్ నియామకం

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా ఇన్చార్జిగా నీలం భాస్కర్ నియామకం

📰 Generate e-Paper Clip

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా ఇన్చార్జిగా నీలం భాస్కర్ నియామకం

జనగామ జిల్లా ప్రతినిధి, జె.ఉపేందర్, అక్టోబర్ 09 (ప్రజావాణి): సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా ఇన్చార్జిగా రఘునాథ్ పల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన నీలం భాస్కర్ ను నియమించారు.

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆదేశానుసారం, జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు సూచన మేరకు, రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్ మరియు రాష్ట్ర కమిటీ నిర్ణయంతో ఈ నియామకం జరిగినట్లు రాష్ట్ర కార్యదర్శి గోపాల్ దాస్ ఉపేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జనగామ జిల్లా అధ్యక్షులు జావీద్ పాషా సహకారంతో ఈ నియామకం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. సమాచార హక్కు చట్టం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో నీలం భాస్కర్ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీని జిల్లాలో మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని నూతన జిల్లా ఇన్చార్జి నీలం భాస్కర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.