జనగామలో లయన్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాలు ప్రారంభం
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ అక్టోబర్ 9 (ప్రజావాణి): లయన్స్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం అక్టోబర్ మాసాన్ని విజన్ అవేర్నెస్ మంత్ గా నిర్వహిస్తున్న సందర్భంగా, డిస్ట్రిక్ట్ 320F, రీజియన్ 6 – జనగామ జైనాస్ రీజియన్ ఆధ్వర్యంలో జనగామ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉచిత కంటి పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం జనగామలోని ఆయుష్మాన్ హాస్పిటల్లో ఉచిత కంటి పరీక్షల శిబిరాల ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, పూర్వ జిల్లా గవర్నర్ మరియు రీజన్ అడ్వైజర్ లయన్ కన్నా పరశురాములు ముఖ్య అతిథిగా, రీజియన్ చైర్మన్ లయన్ జైన రమేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ శిబిరాల ద్వారా ప్రతిరోజూ 500 నుండి 600 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో క్యాటరాక్ట్ ఉన్నట్లు గుర్తించిన వారిని హనుమకొండలోని ఆసుపత్రికి పంపించి ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నారు.
ఈ కార్యక్రమంలో లయన్ ఎడమ సంజీవ రెడ్డి, లయన్ తీరుపల్లి కృష్ణారెడ్డి, జిల్లా మార్కెటింగ్ చైర్మన్ లయన్ కృష్ణజీవన్ బజాజ్, జోన్ చైర్మన్ లయన్ రవి నాయక్, లయన్ కన్నా శ్రీనివాస్, లయన్ రేణికుంట కృష్ణ, సూర్య క్లబ్ అధ్యక్షులు లయన్ నాగంపల్లి శ్రీనివాస్, లయన్ పానూగంటి యాదగిరి, మిలీనియం నుండి బాల్దే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ, జనగామ ఆబాద్, సూర్య, బి-బాయ్స్ తో పాటు రీజియన్ 6 లోని పలు క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొని శిబిరాన్ని విజయవంతంగా ప్రారంభించారు.

ఉచిత కంటి పరీక్షల శిబిరాల షెడ్యూల్ వివరాలు:
– అక్టోబర్ 9 (శుక్రవారం): జనగామ ఆయుష్మాన్ హాస్పిటల్
– అక్టోబర్ 11 (ఆదివారం): జనగామ వైస్సాస్సార్ భవన్, బతుకమ్మ కుంట
– అక్టోబర్ 12 (సోమవారం): కల్లెం గ్రామం
– అక్టోబర్ 13 (మంగళవారం): పెంబర్తి గ్రామం
– అక్టోబర్ 14 (బుధవారం): కోలుకొండ గ్రామం
– అక్టోబర్ 15 (గురువారం): కుందారం గ్రామం
– అక్టోబర్ 16 (శుక్రవారం): నవాబుపేట గ్రామం
– అక్టోబర్ 17 (శనివారం): నెల్లుట్ల
– అక్టోబర్ 18 (ఆదివారం): బాణాపురం, శ్రీ సరస్వతి శిశు మందిర్, జనగామ

