📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబి.కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డ్రెస్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బి.కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డ్రెస్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

బి.కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డ్రెస్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు,బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి.

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

చేగుంట మండలంలోని బి.కొండాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు డ్రెస్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడం, వారి విద్యాభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహం అందించడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చేగుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు,బి.కొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి, చేగుంట మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, బి.కొండాపూర్ ఉపసర్పంచ్, మాజీ సర్పంచ్ బాల్నర్స్, మాజీ ఎంపీటీసీ నవీన్, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.