📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదివంగత కొమ్మినేని సామ్రాట్ 14వ వర్ధంతి

దివంగత కొమ్మినేని సామ్రాట్ 14వ వర్ధంతి

📰 Generate e-Paper Clip

దివంగత కొమ్మినేని సామ్రాట్ 14వ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ ముఖ్య నేతలు
ముదిగొండ అక్టోబర్ 9 ప్రజావాణి
ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దివంగత కొమ్మినేని సామ్రాట్ 14వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మరియు సూడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… ప్రజా సంక్షేమానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కొమ్మినేని సామ్రాట్ చేసిన సేవలు అనితరసాధ్యమైనవని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చి రామయ్య, మండల మొదటి జోన్ ఇంచార్జి భూక్యా ధర్మా నాయక్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొమ్మినేని రమేష్ బాబు, పిఎసిఎస్ చైర్మన్ సామినేని వెంకటయ్య, గోకినేపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ మీగడ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు పుల్లారెడ్డి, గుండు వెంకట్ (మీ సేవా), లింగయ్య, రంగా జనార్దన్, వేల్పుల మురళితో పాటు పలువురు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని సామ్రాట్ అమర హై అంటూ జోహార్లు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.