📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూసుమంచిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం

కూసుమంచిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

కూసుమంచిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం
గ్యాస్ట్రో, గైనిక్ సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు
కూసుమంచి ప్రజావాణి అక్టోబర్ 9:
కూసుమంచి మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో ఈ నెల 11వ తేదీ ఆదివారం ఖమ్మం గ్యాస్ట్రో అండ్ గైనిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ శిబిరం కొనసాగనుంది.
ఈ శిబిరంలో గ్యాస్ట్రో సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, మహిళలకు గైనిక్ సమస్యలపై వైద్య సేవలు అందించనున్నారు. అలాగే రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర (షుగర్) పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించనున్నారు.
మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎం. అనిమేష్ రెడ్డి, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ విష్ణుప్రియ ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
కూసుమంచి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి నిర్వాహకులు కోరుతున్నారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.