📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి రూ.1.05 లక్షల విరాళం

ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి రూ.1.05 లక్షల విరాళం

📰 Generate e-Paper Clip

*ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి రూ.1.05 లక్షల విరాళం…….*
*-గిరిజనుల ఆరాధ్యదైవం ఆలయ నిర్మాణానికి మాజీ సర్పంచ్ పత్యానాయక్ సహకారం….*
*నాగర్ కర్నూల్ జిల్లా..*

కల్వకుర్తి నియోజకవర్గం
ప్రతినిధి

: (అక్టోబర్:08 ప్రజావాణి)
వెల్దండ: మండల పరిధిలోని గానుగట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని పుష్కబోడు తండాలో గిరిజనుల ఆరాధ్యదైవమైన ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి మాజీ సర్పంచ్ పత్యానాయక్ ఆర్థిక సహాయం అందించారు. ఆలయ నిర్మాణ పనులకు తన వంతు సహకారంగా రూ.1,05,000 విరాళాన్ని అందజేశారు.
ఇస్కా బోడు తండాలో ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు, భక్తులు కృషి చేస్తున్నారు. దేవాలయ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సర్పంచ్ పత్యానాయక్ రూ.1.05 లక్షల విరాళాన్ని అందించడం పట్ల గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పత్యానాయక్ మాట్లాడుతూ ముత్యాలమ్మ దేవాలయం గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన మాజీ సర్పంచ్ పత్యానాయక్‌కు తండా ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ నిర్మాణానికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి సహకరించాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.