📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonపోగొట్టుకున్న 67 ఫోన్లు బాధితులకు అందజేసిన జనగామ పోలీసులు

పోగొట్టుకున్న 67 ఫోన్లు బాధితులకు అందజేసిన జనగామ పోలీసులు

📰 Generate e-Paper Clip

పోగొట్టుకున్న 67 ఫోన్లు బాధితులకు అందజేసిన జనగామ పోలీసులు

ఫోన్లు పోయిన వెంటనే సెయిర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి జనగామ డిసిపి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 08(ప్రజావాణి): జనగామ జిల్లాలో పోగొట్టుకున్న 67 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో డిసిపి రాజమహేంద్ర నాయక్ బాధితులకు ఫోన్లనుగురువారం అందజేశారు.

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR (Central Equipment Identity Register) పోర్టల్ https://www.ceir.gov.in/ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఫోన్ ను బ్లాక్ చేయవచ్చన్నారు.

కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో CEIR బాధ్యతాధికారిని సంప్రదించాలని, వారు వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలని, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనవద్దని హెచ్చరించారు. రికవరీలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.

*CEIR లో నమోదు విధానం:*
*1.* పోయిన ఫోన్ SIM ను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలి.
*2.* పోలీస్ స్టేషన్ / మీ సేవాలో MISSING కింద చలానా కట్టాలి.
*3.* CEIR పోర్టల్ లో IMEI నంబర్లు నమోదు చేసి దరఖాస్తు పూర్తి చేయాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.