📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిపై దుష్ప్రచారం తగదు

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిపై దుష్ప్రచారం తగదు

📰 Generate e-Paper Clip

*ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిపై దుష్ప్రచారం తగదు*

సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారినిఉపేక్షించొద్దు

*కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 8 (ప్రజావాణి):ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు కలెక్టరేట్ వద్ద సమావేశం ముగించుకొని బయలుదేరుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు పథకం గురించి మహిళల స్పందనను తెలుసుకోవడానికి ఆయన బస్సు ఎక్కారని తన కూతురు లాంటి అమ్మాయితో చేయి పట్టుకొని ఆప్యాయతతో మాట్లాడితే సంస్కారం లేని నాయకులు ఎమ్మెల్యే పైన సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని అన్నారు దమ్ముంటే అభివృద్ధిపై ప్రశ్నించాలని రాజకీయ విమర్శ చేస్తే హుందాగా ఉండాలని ఇట్లా ఆడపిల్లల గౌరవాలకు భంగం కలిగించేలా ఉండొద్దని హితవు పలికారు ప్రతీ మహిళను తన తల్లిలా చెల్లిలా పలకరించే రంగారెడ్డి తన రాజకీయ జీవితంలో మహిళలకు అత్యంత ప్రధాన్యత ఇచ్చి గౌరవిస్తారని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే తట్టుకోలేని బిఆర్ఎస్ నాయకులు కుళ్ళుతో విమర్శించడానికి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి వారిని క్షమించి వదిలేస్తే సమాజానికి మంచిదికాదని మరోసారి ఆడపిల్లల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో వక్రీకరణలు చేయకుండా కఠినంగా శిక్షించాలని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.