📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజల అభివృద్ధికి అందరి సమన్వయంతో కృషి

ప్రజల అభివృద్ధికి అందరి సమన్వయంతో కృషి

📰 Generate e-Paper Clip

ప్రజల అభివృద్ధికి అందరి సమన్వయంతో కృషి

* రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి
* రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద

*మన ప్రజావాణి*
మంచిర్యాల జిల్లా:-

ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎస్.ఈ. బానోత్ రాజన్న, మండల తహసిల్దార్ సతీష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రికి మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ సదుపాయాల విస్తరణ, రహదారుల అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాల అమలు తదితర కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉందని తెలిపారు. గ్రామంలో 33 కె.వి. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు ఎంతో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమమని, సబ్‌స్టేషన్ ఏర్పాటుకు భూమి కేటాయింపు విషయంలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, కొందరు గ్రామస్తులు భూమి విషయమై తమను కలిసి విజ్ఞప్తి చేశారని, గ్రామ ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందరి సహకారంతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్రమంలో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించడంతో పాటు ఉచిత విద్యుత్ పథకాల ద్వారా పేదలపై ఆర్థిక భారం తగ్గిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,. గ్రామంలో 32 ఇందిరమ్మ ఇళ్లుమంజూరయ్యాయని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంజూరైన ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి, ప్రభుత్వ సహకారంతో ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పించడంలో భాగంగా గ్రామానికి 38 పెన్షన్లు మంజూరయ్యాయని, అర్హులైన 38 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందనున్నాయని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారుపిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదిగి మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో  10 వేల మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు కానుందని, సిబిఎస్‌ఈ/రెసిడెన్షియల్ విద్యా సదుపాయాలతో సుమారు 2 వేల 500 మంది విద్యార్థులకు వసతితో కూడిన విద్యా సంస్థ ఏర్పాటు చేసేందుకు చర్యలుకొనసాగుతున్నాయని, ఈ అవకాశాలను స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సదుపాయం అందించడం జరుగుతుందని, చికిత్స ఖర్చులు పెరిగిన సందర్భాలలో పేదలపై భారం పడకుండా ముఖ్యమంత్రి సహాయనిది నుండి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు చిన్నచిన్న వైద్య అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు గ్రామాలలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఎం.ఎల్.ఎ. కాలనీ నుండి ఆర్‌కె-5 వరకు సుమారు 4.7 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 4.85 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, రాబోయే రోజులలో గ్రామంలోని అన్ని ప్రాంతాలలో అవసరమైన రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మందమర్రి మున్సిపల్ పరిధిలోని 24 వార్డులకు సంబంధించి సుమారు 15 కోట్ల రూపాయల యు.ఐ.డి.ఎఫ్. నిధులతో 14వ వార్డులో అభివృద్ధి పనులకు మున్సిపల్ కమిషనర్ రాయలింగు తో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశల వారీగా కల్పించేందుకు చర్యలుతీసుకుంటున్నామని తెలిపారు. సుమారు 40 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అమృత్ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించే కార్యక్రమం కొనసాగుతుందని, పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు సి.సి. మురుగు కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మందమర్రి పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.