📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగ్యాస్ సిలిండర్లపై రూ. 300 సబ్సిడీ

గ్యాస్ సిలిండర్లపై రూ. 300 సబ్సిడీ

📰 Generate e-Paper Clip

*గ్యాస్ సిలిండర్లపై రూ. 300 సబ్సిడీ…*

*5 కిలోల సిలిండర్లకు కూడా సబ్సిడీ వర్తింపు*

*మరో 25 లక్షల కనెక్షన్ల మంజూరుకు ఆమోదం.*

*సామాన్యులకు కేంద్రం మరో తీపికబురు..నేరుగా అకౌంట్లోకి..*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07*

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదలకు గ్యాస్ సిలిండర్లపై రూ. 300 సబ్సిడీని అందిస్తోన్న విషయం తెలిసిందే. 2016 మేలో ప్రధాని మోదీ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 10.57 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించారు. సాధారణ ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూ రిటీ డిపాజిట్ , సిలిండర్ కోసం ఇతర ఛార్జీలు వసూలు చేస్తారు. కేంద్రం ఉజ్వల్ యోజన పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్ , సిలిండర్లు అందిస్తోంది. 2025-26లో 42 కోట్ల గ్యాస్ రీఫిల్స్‌కు సబ్సిడీ అందించారు. తాజాగా ఈ స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో కూడా రూ. 300 సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో పేదలకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు.

*5 కిలోల సిలిండర్లకు కూడా సబ్సిడీ…*

5 కిలోల సిలిండర్లకు సంబంధించి దామాషా పద్దతిలో సబ్సిడీ అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెలు, బొగ్గు , పిడకల లాంటి వాటిపై పేదలు ఆధార పడకుండా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు సిలిండర్లపై రూ. 300 సబ్సిడీ అందిస్తోంది. 2016 మే1న యూపీలోని బలియాలో ఈ స్కీమ్ మోదీ స్వయంగా ప్రారంభించారు. 2020 మార్చి నాటికి 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆ లక్ష్యానికి కేంద్రం చేరు కుంది. ఇక ఉజ్వల 2.0 కింద 1.6 కోట్ల కనెక్షన్లను అందించాలని నిర్ణయం తీసుకుంది. 2022 డిసెంబర్‌కు ఈ లక్ష్యం కూడా పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా 9.6 కోట్ల కనెక్షన్లను ఉచితంగా పేదలకు అందించారు.

*మరో 25 లక్షల కనెక్షన్ల మంజూరుకు ఆమోదం…*

తాజాగా ఉజ్వల్ యోజన పథకం ద్వారా మరో 25 లక్షల కనెక్షన్లను అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలోని లబ్దిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు స్టవ్ , సిలిండర్ అందిస్తున్నారు. తొలి సిలిండర్ ఉచితంగా ఇస్తుండగా..ఆ తర్వాత ప్రతీ సిలిండర్ రీఫిల్లింగ్‌ పై రూ. 300 సబ్సిడీ అందిస్తోంది. ఉజ్వల్ యోజన వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ పథకంలో లబ్ది పొందేందుకు దర ఖాస్తు చేసుకోవచ్చు. మీకు అవసరమైన గ్యాస్ సర ఫరా సంస్థను ఎంచు కోవచ్చు. రేషన్ కార్డు కలిగి ఉండాలి. అర్హులకు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఆధార్ కార్డు , బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించాలి. ఇక డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నేరుగా దరఖాస్తు చేసు కోవచ్చు. ఇప్పటివరకు కోట్లాదిమందికుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.రాబోయే రోజుల్లో మరింతమందికి ఈ ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న రోజుల్లో లబ్దిదారుల సంఖ్య పెరగ నుందని చెప్పవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.