📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలక్ష్మిపూర్ లో ఐరా అకిరా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

లక్ష్మిపూర్ లో ఐరా అకిరా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

లక్ష్మిపూర్ లో ఐరా అకిరా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

బెజ్జంకి,అక్టోబర్ 7 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఐరా అకీరా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.సర్పంచ్ ముక్కిస్ కవిత–రత్నాకర్ రెడ్డి, పాలకవర్గం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో డాక్టర్ దిలీప్ రెడ్డి (గ్యాస్ట్రో సర్జన్), డాక్టర్ శ్రీలక్ష్మీ రెడ్డి (జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్) పాల్గొన్నారు.200 మందికి పైగా గ్రామస్తులకు బీపీ, షుగర్, యూరిన్, థైరాయిడ్ తదితర పరీక్షలు నిర్వహించారు.పరీక్షల అనంతరం వైద్యులు ఆరోగ్య పరిస్థితిపై సలహాలు,సూచనలు అందించి, అవసరమైన వారికి మందులు పంపిణి చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కిస్ కవిత–రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గంగాధర హరీష్, వార్డు సభ్యులు పాకాల శ్రీనివాస్ రెడ్డి, కూతురు అనసూర్య, లింగాల అర్జున్, బోనగిరి మంజుల,చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,పీఏసీఎస్ డైరెక్టర్ తుమ్మ సుధాకర్ రెడ్డి, తాడూరి రాంరెడ్డి, ముక్కిస్ శ్రీనివాస్ రెడ్డి, చిలువేరు రాజిరెడ్డి, రామకృష్ణ రెడ్డి, నీలం మధుకర్ రెడ్డి, పాశం అనిల్, ఎండీ అజ్జిమొద్దిన్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.