📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి):జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం, ఆయినాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, ఎంపీటీసీ పబ్బోజు విజేందర్ కుమారుడి నిన్న రాత్రి కుషాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన, ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బుధవారం బాధిత కుటుంబాన్ని కలిసి, వారిని ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… చిన్న వయసులోనే యువకుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఆ కుటుంబానికి జరిగిన ఈ లోటు తీరనిదని అన్నారు. మృతుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.