📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా పాతర్లపల్లి లో అంగన్ మిలాన్

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా పాతర్లపల్లి లో అంగన్ మిలాన్

📰 Generate e-Paper Clip

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా పాతర్లపల్లి లో అంగన్ మిలాన్

* పాతర్లపల్లి గ్రామంలో సర్పంచ్ బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి

జమ్మికుంట అక్టోబర్ 6 (ప్రజావాణి)

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాతర్లపల్లి గ్రామంలో సర్పంచ్ బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాయకులు, ఆశా కార్యకర్తలను శాలువాలతో సన్మానించి, వారి సేవలను అభినందించారుఅనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారులకు పౌష్టికాహారం ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక విద్య అందించడంతో పాటు గర్భిణీలు, బాలింతల సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారుకేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలు చిన్నారుల ఆరోగ్యం పోషణ, విద్య అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారుప్రధాని నరేంద్ర మోదీ గ “సేవే లక్ష్యం ప్రజా సంక్షేమమే ధ్యేయం” అనే స్ఫూర్తితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో బీజేపీ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, మండల ప్రధానకార్యదర్శి గుత్తికొండ రాంబాబు, ఉప్పుల రమేష్,ఇంగ్లె ప్రభాకర్, తడిగోప్పుల రమేష్,తాళ్ల లావణ్య,చింతల ఐలయ్య, నల్ల లింగారెడ్డి, గుడికందుల పావని, తాల్ల పాపిరెడ్డి, ఆసాల సుధాకర్, తుపాకుల సతీష్, ఉప్పు దుర్గయ్య, జిల్లెల్ల శ్రీపాల్ రెడ్డి, ఇంగ్లే రమేష్, జంగం సమ్మయ్య, వడ్లకొండ జలపతి, చల్లూరి కుమార్, ఎలవేణి శ్రీధర్, చిట్ల శ్రీనివాస్, కోడం నవీన్, అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు, ఆశా కార్యకర్తలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.