ఎల్ఓసి అందేసిన వొడితల ప్రణవ్
జమ్మికుంట అక్టోబర్ 6 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బూజునూరు గ్రామంలో కష్టంలో ఉన్న ప్రతి కుటుంబానికి మానవతా దృక్పథంతో తన వంతు సహాయాన్ని అందజేస్తూ పేద వారికి కష్ట సమయంలో అండగా నిలుస్తున్నారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తన దృష్టికి వచ్చిన వెంటనే వారి కష్టం తెలుసుకొని వారికి అండగా నిలుస్తూ కుటుంబానికి పెద్ద దిక్కులాగా నిలుస్తున్నారు.
తాజాగా ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన మచ్చర్ల మొగిలి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రులపాలు కాగా ఇట్టి విషయాన్ని ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అధికారులతో మాట్లాడి 1,75,000/- ఎల్ఓసి అందజేశారు. కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి,మంత్రులకు,ఇంచార్జి ప్రణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు లబ్ధిదారులు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

