📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణటీయూడబ్ల్యూజే-హెచ్143 నూతన అధ్యక్షుడు రాఘవ రెడ్డికి ఘన సన్మానం

టీయూడబ్ల్యూజే-హెచ్143 నూతన అధ్యక్షుడు రాఘవ రెడ్డికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

*టీయూడబ్ల్యూజే-హెచ్143 నూతన అధ్యక్షుడు రాఘవ రెడ్డికి ఘన సన్మానం*

*ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన అధ్యక్షుడికి జర్నలిస్టుల శుభాకాంక్షలు*

పటాన్‌చెరు, అక్టోబర్‌ 6 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గ టీయూడబ్ల్యూజే (హెచ్-143) నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ దూలిపాళ్ల రాఘవ రెడ్డి(టీవి9)కి తోటి జర్నలిస్టులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు రాఘవ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయాలని కోరారు.
నూతన అధ్యక్షుడి నాయకత్వంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘం మరింత చురుగ్గా పనిచేయాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ముక్కగల్ల యాదన్న, జోగినాథ్, శ్రీనివాస్, రాజ నర్సింహా, శ్రీకాంత్, జక్కిరెడ్డి శేఖర్ రెడ్డి, మన్నే ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.