📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనూతన పిఎసిఎస్ చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డికి ఘన సత్కారం.

నూతన పిఎసిఎస్ చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డికి ఘన సత్కారం.

📰 Generate e-Paper Clip

నూతన పిఎసిఎస్ చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డికి ఘన సత్కారం.

మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 06

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు , డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అభినందనలు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలొని అచ్చంపేట నూతన PACS చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డి గారిని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి నివాసంలో నూతన పిఎసిఎస్ చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిసి, నూతన బాధ్యతల సందర్భంగా అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డి గారిని శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.
రైతుల సంక్షేమం సహకార రంగ బలోపేతం – ప్రజా సేవ ప్రధాన లక్ష్యాలుగా నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి గారు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నూతన బాధ్యతల్లో పట్లోళ్ల జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.