కమలాపూర్ మండల్ లో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడులు
గ్రామాల్లో జోరుగా సాగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై నిఘ
పలు ప్రాంతాల్లో తనిఖీలు మద్యం స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్టు సమాచారం
అసలు ఎన్ని షాపులు? ఎంత మద్యం పట్టుబడింది? ఎవరిపై కేసులు? అధికారిక వివరాలు వెల్లడి కావాల్సిందే!!!
ప్రజావాణి అక్టోబర్ 6 కమలాపూర్ మండల్ పరిధిలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపుల వ్యవహారం పై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సాధించినట్లు సమాచారం
గ్రామాల్లో అనాధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎక్సైజ్ ఎస్సై ఆధ్వర్యంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తుంది
తనిఖీల్లో కొన్ని బిల్ట్ షాపులు గా అనుమతిస్తున్న ప్రాంతాల్లో మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం అయితే ఏ గ్రామంలో ఎంత మొత్తంలో మద్యం స్వాధీనం చేస్తున్నారు ఎంతమందిపై కేసులు నమోదు చేశారు స్వాధీనం చేసుకున్న మద్యం వివరాలు ఎంత? అనే పూర్తి వివరాలను ఎక్సేంజ్ శాఖ అధికారికంగా వెల్లడించాల్సి ఉన్నది
గ్రామాల్లో బెల్ట్ షాపుల దందాపై చర్చ
మండలంలోని కొన్ని గ్రామాల్లో అధికారిక అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి అన్న ఆరోపణాలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా రాత్రివేళలో కూడా మధ్య విక్రయాలు సాగుతున్నాయి అన్న విమర్శలు ఉన్నాయి దీంతో గ్రామాల్లో యువతతో పాటు ఇతరులు, మద్యానికి బానిసవుతున్నారంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లయితే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు కేవలం అప్పుడప్పుడు దాడులు నిర్వహించడం కాకుండా బెల్ట్ షాపుల వెనుక ఉన్న అసలు వ్యవస్థపై కూడా అధికారులు దృష్టి సాదించాలని డిమాండ్ చేస్తున్నారు
దాడులు జరిగాయి కానీ వివరాలు ఎక్కడ?
ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం బయటకు రావడంతో ప్రస్తుతం మండల వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీ అంశంగా మారింది అయితే దాడులు ఏ గ్రామాల్లో జరిగాయి ఎంత మంది సిబ్బంది పాల్గొన్నారు ఎంత మద్యం పట్టుబడింది ఎంతమందిపై కేసులు నమోదయ్యాయి అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది
ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు అధికారిక వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది
రెండు షాపులపై వరుసగా తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అదే సమయంలో దాడులు వివరాలు కేసులు వివరాలు స్వాధీనం చేసుకున్న మద్యం పరిణామాలపై ఎక్సైజ్ శాఖ స్పష్టమైన ప్రకటన చేయాలని పలువురు కోరుచున్నారు
ఇకనైనా ఎక్సైజ్ శాఖ కేవలం దాడులకే పరిమితం కాకుండా మండలంలో బెల్ట్ షాపుల నియంత్రణకు శాశ్వత చర్యలు తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి…

