📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశాశ్వత లైబ్రరీ, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష

శాశ్వత లైబ్రరీ, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ లక్షెట్టిపేట అక్టోబర్ 4 ::-
పట్టణంలో శాశ్వత లైబ్రరీతో పాటు ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు బొప్పు సతీష్ గాంధీ చౌక్, లక్షెట్టిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

లక్షెట్టిపేటలో శాశ్వత లైబ్రరీ లేకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బొప్పు సతీష్ పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో శాశ్వత ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలకు సకాలంలో సేవలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు.

బొప్పు సతీష్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పలు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వ్యాపారస్తులు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లక్షెట్టిపేటలో శాశ్వత లైబ్రరీ, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎస్ఐ గోపతి సురేష్ బొప్పు సతీష్‌తో చర్చించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వారి హామీ మేరకు బొప్పు సతీష్ ఆమరణ నిరాహార దీక్షను విరమించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.