శాశ్వత లైబ్రరీ, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష

ప్రజావాణి న్యూస్ లక్షెట్టిపేట అక్టోబర్ 4 ::- పట్టణంలో శాశ్వత లైబ్రరీతో పాటు ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు బొప్పు సతీష్ గాంధీ చౌక్, లక్షెట్టిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. లక్షెట్టిపేటలో శాశ్వత లైబ్రరీ లేకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బొప్పు సతీష్ పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో శాశ్వత ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలకు సకాలంలో సేవలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు....