📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅర్హులైన ప్రతికుటుంబానికి సంక్షేమ పథకాలు

అర్హులైన ప్రతికుటుంబానికి సంక్షేమ పథకాలు

📰 Generate e-Paper Clip

అర్హులైన ప్రతికుటుంబానికి సంక్షేమ పథకాలు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
పెద్దవంగర, అక్టోబర్ 5 ప్రజావాణి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు రూ.64 లక్షల 7 వేల 424 విలువైన చెక్కులను అందజేశారు. ప్రభుత్వం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంగం మురళి గౌడ్, మాజీ అధ్యక్షులు ముద్ధసాని సురేష్, సీనియర్ నాయకులు సంకేపల్లి రవీందర్ రెడ్డి, అనపురం వినోద్,పన్నీరు వేణు, దాసరి శ్రీనివాస్, పొడిశెట్టి సైదులు, బీసు హరికృష్ణ, కనుకుంట్ల నరేష్, ఆవుల మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.