📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaహ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ విజేతకు ఘన సన్మానం

హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ విజేతకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

కర్నాటి వజ్రమ్మ వెంకటేశం కు శాలువా కప్పి సత్కరించిన మాజీ ఎంపీపీ తోకల వెంకన్న

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని హ్యాండ్లూమ్స్ కార్యాలయంలో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ తెలంగాణ ప్రతినిధుల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశంకు ఘనంగా సత్కారం జరిగింది. చండూర్ మండల మాజీ ఎంపీపీ తోకల వెంకన్న ఆధ్వర్యంలో విజేతకు శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. చేనేత కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండూరి జనార్ధన్, ఇరిగి రామన్న, ఇరిగి గురునాథం తదితరులు పాల్గొని విజేతను అభినందించారు. హ్యాండ్లూమ్ రంగ అభివృద్ధికి కర్నాటి వజ్రమ్మ వెంకటేశం చేస్తున్న కృషిని కొనియాడారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుండి మరిన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.