ఘట్కేసర్, అక్టోబర్ 5 (ప్రజావాణి): సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా నాయకులు అంగన్ మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘట్కేసర్ మండల పరిధిలోని పోచారం డివిజన్ కొర్రెముల, చౌదరిగూడ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన మహిళా మోర్చా నాయకులు అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాలుగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం, పౌష్టికాహారం అందిస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి వంచ స్వప్న ఆధ్వర్యంలో గర్భిణులు, చిన్నారులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల బీజేపీ అధ్యక్షుడు బస్వ రాజు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమ్మిడి శోభారాణి, మండల ప్రధాన కార్యదర్శి గొబ్బిరి మన్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు బైనగారి సత్యనారాయణ, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు పల్లె బిక్షపతి గౌడ్, కార్యదర్శి బీరం మహేందర్ పటేల్, దళిత మోర్చా కార్యవర్గ సభ్యుడు కనకం నాగరాజు, బూత్ అధ్యక్షురాలు ఉమా మమత శర్మ తదితరులు పాల్గొన్నారు.


