📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఎండపల్లి ప్రజావాణిలో 6 అర్జీల స్వీకరణ

ఎండపల్లి ప్రజావాణిలో 6 అర్జీల స్వీకరణ

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి 6 దరఖాస్తులను స్వీకరించారు. ఎంపీడీవో డి కృపాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌కు 3, రెవెన్యూ శాఖకు 2, ఇందిరమ్మ ఇళ్లకు 1 అర్జీ వచ్చాయి. అర్జీలను పరిశీలించిన ఎంపీడీవో, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అనిల్ కుమార్, వ్యవసాయాధికారి మహేష్‌తో పాటు 11 మంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.