సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్ మిలాన్ కార్యక్రమం
ఘట్కేసర్, అక్టోబర్ 5 (ప్రజావాణి): సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా నాయకులు అంగన్ మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘట్కేసర్ మండల పరిధిలోని పోచారం డివిజన్ కొర్రెముల, చౌదరిగూడ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించిన మహిళా మోర్చా నాయకులు అంగన్‌వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాలుగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం, పౌష్టికాహారం...