📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఓట్లు తొలగించడం అంటే రాజ్యాంగంపై దాడే

ఓట్లు తొలగించడం అంటే రాజ్యాంగంపై దాడే

📰 Generate e-Paper Clip

ఓట్లు తొలగించడం అంటే రాజ్యాంగంపై దాడే: మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జూకంటి రాజాగౌడ్

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

మూకుమ్మడిగా ఓట్లు తొలగించే అధికారం ఎవడికీ లేదు. అని
అలాంటి దుర్మార్గపు చర్యను ఏ ప్రజాస్వామ్యవాది సమర్థించబోరని అని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జూకంటి రాజాగౌడ్ అన్నారు.

ఓటును తొలగించడం అంటే శరీరం నుంచి ఆత్మను పెకిలించి వేయడమే అని ఓట్లు తొలగిస్తే ఈ దేశంలో రెండు రకాల పౌరులు పుడతారు అని జూకంటి రాజాగౌడ్ పేర్కొన్నారు.
ఓటు ఉన్నవాడు పౌరుడు, ఓటు లేనివాడు బానిస! ఇదేనా ప్రజాస్వామ్యం? అని రాజా గౌడ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు

ఓటరు జాబితా నుంచి పౌరుల ఓట్లను మూకుమ్మడిగా తొలగించడం అంటే నేరుగా రాజ్యాంగం గుండెలపై కత్తితో పొడవడమేనని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జూకంటి రాజా గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు.

“ఓటరు జాబితా నుంచి లక్షల మంది పౌరుల ఓట్లను గుంపుగా తొలగించి, ఓటు హక్కును నిరాకరించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఇలా చేయడానికి ఈ దేశంలో ఏ అధికారికీ, ఏ వ్యక్తికీ అధికారం లేదు అని రాజాగౌడ్ పేర్కొన్నారు
రాజ్యాంగం పౌరులను ‘ఓటు ఉన్నవారు, ఓటు లేనివారు’ అని రెండు వర్గాలుగా విడగొట్టలేదు. లక్షలకొద్దీ ఓట్లను తొలగించి సొంత దేశంలోనే పౌరులను రెండో తరగతి పౌరులుగా మార్చే ఏ ప్రక్రియ అయినా చట్టవిరుదద్ధం అని అది రాజ్యాంగ హృదయంపై దాడిగా జూకంటి రాజా గౌడ్ అభివర్ణించారు.

“ఇలా మూకుమ్మడిగా ఓట్లను తొలగించడం అంటే ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 326 (ఎన్నికల్లో ఓటు వేసే హక్కు)లను కాలరాయడమే అని భారత పౌరసత్వం ప్రకారం ఓటు హక్కును, ఓటరు జాబితాలో పేరును పౌరుడి నుంచి ఎవరూ వేరు చేయలేరు అని అలా చేస్తే అది శరీరం నుంచి ఆత్మను వేరుచేయడమే అని జూకంటి రాజా గౌడ్ పేర్కొన్నారు.

“ఈ ఓటు హక్కు ఊరికే రాలేదు! మన పూర్వీకులు సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటం చేసి, ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చిన హక్కు ఇది. ఆర్టికల్ 326ను మార్చడం ఎవరి తరమూ కాదు అని జూకంటే రాజాగౌడ్ పేర్కొన్నారు అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.